Biography
ఏనుగుల వీరాస్వామయ్య మదరాసు హైకోర్టులో ప్రధాన దుబాసి (chief interpreter). ఆయన మదరాసులోనే జన్మించారు. దుబాసీగా ఆయన పని ఆంగ్లం నుండి తెలుగులోకి, తెలుగునుండి ఆంగ్లంలోకి అనువదించడమే. ఆంగ్లం, తెలుగు, సంస్కృతం, తమిళ భాషలలో అవలోకగా మాట్లాడగల శక్తిని సంపాదించారు. 1815నుండి 11 సంవత్సరాలు అదాలత్ కోర్టులో పనిచేసి ప్రధాన దుబాసీగా పదవీవరమణ చేసారు. తెలుగుభాషకు ఎనలేని సేవ చేసిన [ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్][1] ఆయనకు బాగా సన్నిహితుడు. ఆయనను బందరులో వీరాస్వామయ్య కలుసుకున్నారు.
వీరాస్వామయ్య కన్యాకుమారి ముదలు కాశ్మీరు వరకు భారతదేశమంతా రెండుసార్లు పర్యటన చేసి తన మిత్రుడైన కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళైకి జాబులు వ్రాశారు. ఆ ఉత్తరాలను శ్రీనివాసపిళ్ళై వీరాస్వామయ్య మరణానంతరం [కాశీ యాత్ర చరిత్ర][2] పేర 1838లో మొదటిసారి ప్రచురించారు. 1869లో ద్వితీయ ముద్రణ వచ్చింది. 1914లో దిగవల్లి వెంకట శివరావుగారు (విజయవాడ) ఈ గ్రంధాన్ని పునర్ముద్రణ చేయించారు.
వీరు చెన్నపట్టణ నగరవాసుల్లో ఆధునిక భావాలను ప్రోత్సాహించడానికి "Hindu literary society" మిత్రులతో కలసి ప్రారంభించారు. వీరాస్వామి తెలుగుభాషా సేవ అమోఘం.
1830 మే 18న వీరాస్వామయ్య ఉత్తరదేశ యాత్రకు మదరాసునుండి బయలుదేరి కాశీకి చేరుకున్నారు. 15నెలల 15రోజుల కాశీ యాత్రను "[కాశీయాత్ర చరిత్ర][2]" గ్రంధంలో చూడవచ్చు.
([భారత సుప్రసిద్ధ గ్రంధాలు - తెలుగు][3] పుస్తకం లోంచి...)
[1]: http://te.wikipedia.org/wiki/ఛార్లెస్_ఫిలిప్_బ్రౌన్
[2]: http://openlibrary.org/works/OL15389316W/కాశీ_యాత్ర_చరిత్ర
[3]: http://openlibrary.org/works/OL15389310W/భారత_సుప్రసిద్ధ_గ్రంధాలు_-_తెలుగు